దేవయాని, శైలేంద్రల ప్లాన్ అదేనా?
on Oct 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -883 లో.. వసుధారని పెళ్లి చేసుకోమని రిషిని జగతి కోరుతుంది. తల్లి కోరికని తీర్చడానికి వసుధారని పెళ్లి చేసుకోవడానికి రిషి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత జగతి వసుధారకి సారి చెప్తుంది. వసుధార కూడా ఇన్ని రోజులు మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించమని అడుగుతుంది.
కాసేపటికి ఎలాగైనా ఇన్ని రోజులు రిషి దూరంగా ఉండడానికి కారణమైన వాళ్ళ గురించి రిషికి తెలిసేలా నువ్వే చెయ్యాలని వసుధార దగ్గర జగతి మాట తీసుకుంటుంది. కాసేపటికి అందరు ఇంటికి వెళ్తారు. జగతిని హాస్పిటల్ నుండి తీసుకొని వెళ్తారు. కాసేపటికి రిషి గుమ్మం ముందు నిలబడి వెయిట్ చేస్తాడు. తను వెళ్లిపోయేముందు అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక రిషి దగ్గరికి వచ్చిన వసుధార.. అవన్నీ మర్చిపోండంటూ రిషికి చెప్తుంది. ఇక అందరు కలిసి రిషి, వసుధారల పెళ్లి చెయ్యాలని అనుకుంటారు. ఇప్పుడే ఎందుకు? జగతి ఆరోగ్యం బాగయ్యాక పెళ్లి చేద్దామని దేవయాని అనగానే.. లేదు ఇప్పుడే చెయ్యాలని జగతి అంటుంది. ఇక అక్కడే ఉన్న ఫణీంద్ర.. జగతి చెప్తుంది కదా, నీకెందుకు ప్రాబ్లెమ్? పంతులు గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమని దేవయానిపై కోప్పడతాడు. కానీ దేవయాని, శైలేంద్ర ఇద్దరు ఎలాగైన ఈ పెళ్లి ఆపాలని అనుకుంటారు.ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తారు. ఈ ఛాన్స్ గనుక మిస్ అయితే మన కోరిక ఎప్పుడు నెరవేరదని దేవయానికి శైలేంద్ర చెప్తాడు. మరొక వైపు తన చేతుల మీదుగా కొడుకు పెళ్లి జరుగుతున్నదుకు జగతి హ్యాపీగా ఉంటుంది.
మరొక వైపు జగతి దగ్గరకి దేవయాని వచ్చి.. నర్సుని జగతికి జ్యూస్ తీసుకొని రమ్మని పంపిస్తుంది. రిషికి నీపై ప్రేమ లేదు. ఏదో అలా మాట్లాడుతున్నడు. నీ కోరిక తీర్చడానికి ఇలా చేస్తున్నాడని జగతితో దేవయాని మాట్లాడుతుంది. ఎప్పటికైన రిషి మనసులో నాపై ప్రేమ ఉంటుంది. నా మాట వింటాడని దేవయాని ఎప్పటిలాగే కుట్రపూరితమైన మాటలు మాట్లాడుతుంటుంది. ఆ తర్వాత నర్సు తీసుకొని వచ్చిన జ్యూస్ జగతి తాగుతుంది. మరొక వైపు వసుధారని పెళ్లి కూతురులాగా ధరణి రెడీ చేస్తుంది. ఇదంతా మా ఆయన చేస్తుంటే సైలెంట్ గా ఉండాల్సి వస్తుందంటూ ధరణి అంటుంది. శైలేంద్ర చేసే పనులు ఎవరికి చెప్పాలేక ఏం చెయ్యలేకపోతున్నానని వసుధారకి చెప్తుంది ధరణి. మేడమ్ కోరిక తీర్చాడానికి రిషి సర్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంతకన్నా నాకు సంతోషం లేదని వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
